‘మీ దగ్గరకు చేరే వరకు నేను మిమ్మల్ని మిస్ అవుతాను’ అంటూ రిషి కపూర్ కూమార్తె రిధిమా కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికారు. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ గురువారం ఉదయం మృతిచెందిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేసిన రిషి కపూర్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ముంబైలో కన్నుమూశారు. రిషికపూర్ మృతిపై బాలీవుడ్ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా రిషి కపూర్ కూతురు రిధిమా కపూర్ తండ్రి మరణంపై విచారం వ్యక్తం చేశారు. (నా ప్రేయసితో బ్రేకప్ అయినపుడు నీతూ సాయం చేసింది’)
‘మీ దగ్గరికి వచ్చే దాకా మిమ్మల్ని మిస్ అవుతాను’